: కాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... ఇద్దరు జవాన్లు మృతి, ఇద్దరు ఉగ్రవాదులూ హతం
జమ్మూ కాశ్మీర్ లో నేటి ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కాశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలోకి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. భారత సైనిక స్థావరాలపై కాల్పులకు దిగారు. ఉగ్రవాదుల కాల్పులతో వెనువెంటనే అప్రమత్తమైన సైన్యం కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ కాల్పుల మోత కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృత్యువాతపడ్డారు.