: తిరుమల వెంకన్నకు భూరి విరాళం...రూ.2 కోట్లను అందజేసిన భక్తుడు శ్రీనివాసులరెడ్డి


తిరుమల వెంకన్నకు భక్తుల నుంచి విరాళాలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం వెంకన్న హుండీ ఆదాయం నిత్యం కోటికి పైగానే ఉంటోంది. తాజాగా ఓ భక్తుడు వెంకటేశ్వరస్వామికి భూరి విరాళం ప్రకటించారు. రూ.2 కోట్ల మొత్తాన్ని ఆ భక్తుడు వెంకన్న సన్నిధికి అందజేశాడు. ఈ మేరకు శ్రీనివాసులరెడ్డి అనే భక్తుడు కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి రూ.2 కోట్ల డీడీని అందజేశారు. ఈ భక్తుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News