: ‘సత్యం’ రాజుకు సెబీ నోటీసులు... రూ.1,800 కోట్ల జరిమానా, దానిపై వడ్డీ మరో రూ. 1500 కోట్లను చెల్లించాలని ఆదేశం!


అరచేతిలో వైకుంఠం చూపి తనను నమ్మిన ఇన్వెస్టర్లను నట్టేట ముంచిన నాటి సత్యం కంప్యూటర్స్ చైర్మన్ బైర్రాజు రామలింగరాజుకు ఇంకా కేసుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే దోషిగా తేలిన ఆయనకు శిక్ష కూడా పడింది. ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన రామలింగరాజు అడపా దడపా బయటకు వస్తున్నారు. తాజాగా రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 10 మందికి సెబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. సత్యం కుంభకోణంలో వీరికి సెబీ రూ.1,800 కోట్ల భారీ జరిమానా విధించింది. 2009 నుంచి ఈ జరిమానా వర్తిస్తుందని, కాబట్టి దీనికి 12 శాతం వడ్డీ చొప్పున మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించాలని సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని కూడా సెబీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News