: ‘ప్రిన్స్’ సోదరి కూడా ‘శ్రీమంతురాలే’.. గ్రామాన్ని దత్తత తీసుకున్న గల్లా పద్మావతి


టాలీవుడ్ టాప్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ పలు గ్రామాలకు వరంగానే మారింది. ఇప్పటికే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన మహేశ్ బాబు తెలంగాణలోని అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు చెందిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెనువెంటనే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. ఎవరూ అడగకుండానే నేరుగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వద్దకెళ్లి తాను కూడా పాలమూరు జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే కాక, మరునాడే సదరు గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మహేశ్ బాబు సోదరి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి తాను కూడా ‘శ్రీమంతురాలి’నేనని ప్రకటించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. గ్రామం దత్తత కోసం ఆమె ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా, గ్రామాభివృద్ధి కమిటి ఆమోద ముద్ర వేసింది. అంతేకాక, పద్మావతి నిర్ణయం పట్ల కంచర్లపాలెం వాసులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News