: అధ్యక్షుడు ఆమోదిస్తేనే విదేశీయుల్ని వివాహమాడాలి


బంగ్లాదేశ్ లో కొత్త చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఈ చట్టం ప్రకారం బంగ్లదేశ్ లో ఎవరైనా విదేశీయులను వివాహం చేసుకోవాలని భావిస్తే ముందుగా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు పార్లమెంటులో ఓ చట్టం ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే విదేశీయులు బంగ్లాదేశీయులను వివాహం చేసుకోవాలన్నా, బంగ్లాదేశీయులు విదేశీయులను వివాహం చేసుకోవాలన్నా అధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వోద్యోగి విదేశీయులను పెళ్లి చేసుకుంటే వారు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. ఈ బిల్లును స్పీకర్ స్టాండింగ్ కమిటీకి పంపారు. 60 రోజుల్లో ఆ బిల్లు మార్పులు చేర్పులతో పార్లమెంటు ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News