: సుప్రీం కోర్టుకెక్కిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'బిజినెస్ టుడే' పత్రికలో తన ఫోటోను విష్ణుమూర్తిగా చిత్రీకరిస్తూ ప్రచురించిన కథనంపై తలెత్తిన వివాదంలో తనను కోర్టుకు లాగడాన్ని ధోనీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. 2013లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లోనే ధోనీ స్పందించాడు. అది సరికాదని బిజినెస్ టుడేకు హితవు పలికాడు. అలాగే బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో తనపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించడంపై మరో ఎస్ఎల్ పీ దాఖలు చేశాడు. ఈ కేసును ఈ నెల 14న సుప్రీంకోర్టు విచారించనుంది.

  • Loading...

More Telugu News