: రెండు కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు


రెండు కోట్ల మంది భారతీయులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపుపన్ను శాఖ తెలిపింది. ఆగస్టు 31 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించడంతో భారీ సంఖ్యలో ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. చివరి రోజున 45.18 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయని ఆ శాఖ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 26.12 శాతం పెరిగాయని తెలిపింది. 2014-15 సంవత్సరంలో సుమారు 1.63 కోట్ల మంది ఆన్ లైన్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News