: బిగ్ బాస్ 7వ సీజన్ కు సల్మాన్ స్థానంలో షారూక్!


రియాలిటీ షో 'బిగ్ బాస్' హిందీలో ఎంత ప్రాచుర్యం పొందిందో అందరకూ తెలిసిందే. ముఖ్యంగా 4,5,6 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నటుడు సల్మాన్ ఖాన్ తనదైన స్టార్ ఫేమ్ తో ఈ షోకు విపరీతమైన ఆదరణ తీసుకొచ్చాడు. సల్లూ వ్యాఖ్యానంతో అభిమానులు, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని మరింతగా ఆదరించారు. అయితే, తదుపరి 'బిగ్ బాస్ 7 ' సీజన్ కు హోస్ట్ గా ఈ కండలవీరుడుకి బదులు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం 'మెంటల్' షూటింగులో సల్మాన్ బిజీగా ఉన్నాడు. దానికి తోడు ఆరోగ్య కారణాలు కూడా ఇబ్బంది పెడుతుండటంతో షోను మిస్సవుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News