: రాజస్థాన్ కూడా మాంసం అమ్మకాన్ని నిషేధించింది!
మహారాష్ట్రలో మాంసం అమ్మకం నిషేధంపై ఓపక్క వివాదం రేగుతోంది. మరోపక్క ఈ విషయంలో మహారాష్ట్రను హర్యానా కూడా అనుసరించింది. తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ కూడా వచ్చి చేరింది. జైనులకు పవిత్రమైన పర్యుషాన్ సందర్భంగా మాంసం విక్రయాలపై రాజస్థాన్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 17, 18, 27 తేదీల్లో మాంసం అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివాదం రాజుకుంటోంది. ఏది తినాలో ఏది తినకూడదో ప్రభుత్వాలు చెప్పడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలు కావడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనబడుతోంది.