: సిరియా ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఐఎస్ఐఎస్


ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎయిర్ బేస్ లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా సిరియాలోని ఎయిర్ బేస్ పై ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు దాడి చేశారు. తూర్పు సిరియాలోని ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిర్ బేస్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరిపినట్టు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఈ ఘటనలో సుమారు 18 మంది వాయుసేనకు చెందిన సైనికులు మృతి చెందినట్టు ఆ సంస్థ వెల్లడించింది. వాయుసేన ఎదురు దాడిలో 23 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మట్టికరిచినట్టు ఈ సంస్థ పేర్కొంది. ప్రమాద ఘటనను ప్రసారం చేసిన సిరియన్ స్టేట్ టీవీ మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News