: కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరిన్ని పతకాలు
సమోవాలో జరుగుతున్న కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు గెలుచుకున్నారు. ఈ రోజు ఏకంగా ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు. ఆర్చరీలో ప్రాచీసింగ్, టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో సాయికుమార్ ముకుంద్, ధృతిలు స్వర్ణ పతకాలు సాధించారు. వారితో పాటు బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి, ఆర్చరీలో నితీశ్ కుమావత్, స్క్వాష్ మిక్స్ డ్ టీంలో వెల్వాన్ కుమార్, హర్షిత్ లు రజత పతకాలు దక్కించుకున్నారు. బాక్సింగ్ లో భీం చంద్ సింగ్, ప్రయోగ్ చౌహాన్ లు కాంస్య పతకాలు సాధించారు. వీటితో కలిపి భారత్ కు మొత్తం 17 పతకాలు వచ్చాయి. వాటిలో ఏడు పసిడి, నాలుగు రజత, ఆరు కాంస్య పతకాలున్నాయి. ఈ క్రమంలో పతకాల పట్టికలో భారత్ ఆరవ స్థానంలో ఉంది.