: షాంఘైలో 65 సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాలో బిజీబిజీగా గడుపుతున్నారు. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఈ రోజు ఆయన 'న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్' ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నీటి పారుదల, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ కోరారు. అనంతరం సీఐఐ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 65 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.