: తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చిన చంద్రబాబు
విజయనగరం జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. జిల్లాలో బ్యారేజ్ వద్ద పైలాన్ ను, ఆ తరువాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 2003 నవంబర్ 6న తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన బాబు 12 సంవత్సరాల తరువాత తిరిగి తనే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం. మొత్తం లక్షా 32వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. తొలిదశలో భాగంగా 50వేల ఎకరాలకు ఇవాళ సాగునీటిని విడుదల చేశారు. 117 కిలోమీటర్ల మేర ఉన్న తోటపల్లి కుడి కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.