: ధోనీ స్వర్ణయుగం ఎలా అంతమైంది?


టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ స్వర్ణయుగం 2011 నుంచి ప్రారంభమైంది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఫ్రాంచైజీలో ధోనీ భాగస్వామ్యం కలిగిన తరువాత వారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. కెప్టెన్ గా ధోనీ, బీసీసీఐ చీఫ్ గా శ్రీనివాసన్ బాగా కలిసిపోయారు. కెప్టెన్ ఏది చెబితే బీసీసీఐ చీఫ్ అది వినేవారు. అలాగే బీసీసీఐ చీఫ్ ఏది చెబితే కెప్టెన్ అది వినేవాడు. ఇలా సుదీర్ఘ కాలం వారి బంధం విలసిల్లింది. ఇంతలో బీసీసీఐలో వర్గవిభేదాల కారణంగా దాల్మియా తీవ్రంగా అవమానించబడ్డారు. కనీసం రాష్ట్ర బోర్డులో కూడా పోటీ చేయలేని పరిస్థితిని శ్రీనివాసన్ కల్పించారు. ధోనీ స్వర్ణయుగం నడుస్తుండగా, ఐపీఎల్ లో అవినీతి బయటపడింది. ఇంతలో గత ఆరోపణలు, అవమానం నుంచి నెమ్మదిగా పుంజుకున్న దాల్మియా మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతే, ధోనీ ఫేట్ మారిపోయింది. గతంలో అత్యంత అవమానకరంగా తనను తొలగించిన శ్రీనివాసన్ అదే రీతిలో బీసీసీఐ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించారు. శ్రీనివాసన్ తో వ్యక్తిగత, వ్యాపారానుబంధం పెనవేసుకున్న ధోనీకి గడ్డుకాలం ఎదురైంది. టీమిండియాలో ధోనీ ప్రాధాన్యత తగ్గనప్పటికీ వైఫల్యాలు కొత్త కెప్టెన్ అవసరాన్ని స్పష్టం చేశాయి. ఇంతలో కోహ్లీ కెప్టెన్ గా నిలదొక్కుకున్నాడు. అంతే, ధోనీవైపు చూడాల్సిన అవసరం టీమిండియాకు రాలేదు. కోహ్లీ విఫలమైతే ఆదుకునేందుకు రిజర్వులో రహానే ఉన్నాడు. దీంతో ధోనీ ఒంటరయ్యాడు. ఆటగాళ్లలో, అభిమానుల్లో ధోనీ ప్రాభవానికి లోటులేనప్పటికీ బీసీసీఐలో మాత్రం ధోనీకి గతంలో ఉన్నంత గుర్తింపు లేదనేది వాస్తవం. దీంతో ధోనీ ఒంటరి అయ్యాడు.

  • Loading...

More Telugu News