: 97 విమానాలు, 648 సర్వీసులు... లాభాల పంట పండించుకున్న ఏకైక భారత విమానయాన సంస్థ!


ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా సహా, పలు ప్రైవేటు విమానయాన సంస్థలు లాభాలను నమోదు చేసేందుకు నానా తంటాలు పడుతుంటే, ఒకవైపు తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేసి పేరు తెచ్చుకుంటూ, మరోవైపు 300 శాతం పైగా లాభాలను నమోదు చేసిన ఏకైక భారత విమానయాన సంస్థగా 'ఇండిగో' నిలిచింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభాలు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రూ. 317 కోట్ల నుంచి ఏకంగా రూ. 1,304 కోట్లకు పెరిగి 300 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ఈ మేరకు సంస్థ ఫలితాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు నివేదికను సంస్థ అందజేసింది. 97 విమానాలను కలిగున్న ఇండిగో, రోజుకు 648 సర్వీసులను నడుపుతోంది. త్వరలో ఐపీఓకు రానున్న సంస్థ ఆదాయం రూ. 11,447 కోట్ల నుంచి రూ. 14,320 కోట్లకు చేరింది.

  • Loading...

More Telugu News