: పోలీసులు నేర్పిన ట్రిక్స్ ఉపయోగించి దొంగను పట్టేసింది


దేశ రాజధానిలో అత్యాచారాలు పెరిగిపోతుండడంతో కళాశాల యువతులకు ఢిల్లీ పోలీసులు కొన్ని మెళుకువలు నేర్పారు. యువతి నేర్చిన ఆ చిట్కాలే ఓ దొంగను పట్టించేందుకు సహాయపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... సురభి రాల్హన్ (21) లా చదువుతోంది. తన సోదరితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఓ దొంగ ఆమె హ్యాండ్ బ్యాగ్, ఫోన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన సురభి దొంగకు తన పవర్ పంచ్ రుచి చూపించింది. పోలీసుల దగ్గర నేర్చుకున్నది ఆచరణలో పెట్టింది. పరుగందుకుని దొంగను చాకచక్యంగా పట్టుకుని, వంద మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. తన బ్యాగులో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే ఉంచుకుంటానని, అయితే దానిని వినియోగించే అవకాశం రాలేదని సురభి తెలిపింది. ఆమె ధైర్యసాహసాలకు అంతా అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

  • Loading...

More Telugu News