: అమ్మాయిలను వేధిస్తే అక్కడ 'వెరైటీ' పనిష్మెంట్!
ఆమ్మాయిలను వేధించే ఆకతాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసులు వినూత్న పనిష్మెంట్ లను తెరపైకి తెచ్చారు. ఎవరిపైన అయినా, వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అందితే, వారిని నగర కూడళ్లలోకి తీసుకొచ్చి చేతులకు బేడీలు వేసి అందరికీ కనిపించేలా నిలబెడతామని కలెక్టర్ నిఖిల్ చంద్ర వివరించారు. ఈ చర్యతో ఆకతాయిలకు గుణపాఠం కలుగుతుందన్నదే తమ ఆలోచనని, ఇదే సమయంలో యువతులు కూడా వారిని చూసి జాగ్రత్త పడతారని అన్నారు. పాఠశాలలు, ముఖ్య ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు తిరుగుతూ, వేధింపు రాయుళ్లను పట్టుకుంటారని, వీధుల్లో సైతం గస్తీ పెంచామని వివరించారు.