: కాపులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు


కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. కాపు కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని... అందులో, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం కూడా ఒకటని చెప్పారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వైకాపా తన తీరును మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 17వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే భీమవరంలో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News