: ఆట కోసం కారెక్కి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు!
నాలుగు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు... తమ ఆటలో భాగంగా నిలిపివుంచిన కారులోకి ఎక్కారు. తలుపులు మూసుకున్నారు. డోర్లు లాక్ అయిపోగా, ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ హృదయ విదారక ఘటన నేటి ఉదయం ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో జరిగింది. చాలా సేపు వారు కారులోనే ఉండిపోవడం, బయటి వారెవరూ గమనించక పోవడంతో, ఆక్సిజన్ అందాక కారులోనే వారి ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేక వేర్వేరు కుటుంబాలకు చెందిన పిల్లలా? అన్న విషయం తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.