: లేటుగా వచ్చి లేటెస్ట్ యుద్ధానికి తెరలేపిన మహీంద్రా అండ్ మహీంద్రా


భారత వాహన రంగంలో సరికొత్త పోటీకి తెరలేచింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్ లో అతి తక్కువ ధరకు సరికొత్త వాహనాన్ని విడుదల చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇతర కంపెనీలకు సవాల్ విసిరింది. గురువారం నాడు తమ సరికొత్త ఎస్యూవీ 'టీయూవీ 300'ను రూ. 6.9 లక్షల ధరలో (ఎక్స్ షోరూం, పుణె) విడుదల చేసింది. న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్లోకి పంపిన తరువాత మరో వాహనాన్ని విడుదల చేసేందుకు దాదాపు సంవత్సరం సమయాన్ని తీసుకున్న ఎంఅండ్ఎం, ఓ యుద్ధ ట్యాంకు ఆకారం ఆధారంగా తయారు చేసిన టీయూపీ 300ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. స్టీరింగ్ పై ఆడియో బ్లూటూత్ టెలిఫోనీ కంట్రోల్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ఎం-హాక్ 80 ఇంజన్ లతో ఈ వాహనం లభిస్తుంది. కాగా, ఇదే ఎస్యూవీ విభాగంలో ఇండియాలో అందుబాటులో ఉన్న వాహనాల ధరలతో పోలిస్తే టీయూవీ 300 ధరే తక్కువ. ఈ శ్రేణిలో ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ రూ. 7.89 లక్షలకు, రెనాల్ట్ డస్టర్ రూ. 8.30 లక్షలకు, నిస్సాన్ టెర్రానో రూ. 11.45 లక్షలకు, హ్యుందాయ్ క్రెటా రూ. 9.46 లక్షలకు లభిస్తున్నాయి. ఇక మహీంద్రా విసిరిన ఈ లోకాస్ట్ సవాల్ కు ఇతర కంపెనీలు ఎలా స్పందిస్తాయో!

  • Loading...

More Telugu News