: గుంటూరు కార్పొరేషన్ లో ‘పన్ను’ భోక్తలు... 8 మంది ఉద్యోగుల సస్పెన్షన్
ప్రజల నుంచి వసూలు చేసిన పన్నును సర్కారీ ఖజానాకు జమ చేయాల్సిన ఉద్యోగుల బుద్ధి వక్రమార్గం పట్టింది. చేతికందిన ‘పన్ను’ను ఎంచక్కా జేబులో వేసుకున్నారు. ఇలా ఒక రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు... ఏకంగా రూ.43 లక్షలను గుట్టుచప్పుడు కాకుండా భోంచేశారు. అయితే అవినీతి అక్రమాలు ఎక్కువ కాలం మరుగున పడి ఉండవు కదా? అక్రమార్కుల పాపం పండింది. ‘పన్ను’ భోజనం వెలుగు చూసింది. అక్రమాలకు పాల్పడ్డ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఉదంతంలో అక్రమాలకు పాల్పడ్డ 8 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కమిషనర్ అనురాధ, దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.