: పులిచింతల నిర్వాసితుల నష్టపరిహారానికి ఏపీ ఆర్థిక శాఖ ఆమోదం


పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం కోసం ఇచ్చే నష్టపరిహారానికి ఏపీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించింది. ప్రభుత్వం ఇచ్చే ఏడు లక్షలతో నిర్వాసితులు తమకు ఇష్టమైన చోట స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వచేస్తే గోవిందపురం, రేగులగడ్డ, వేమవరం గ్రామాలకు చెందిన 1,116 కుటుంబాలు ముంపునకు గురవుతాయి. దాంతో, ఆ గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధితులకు దగ్గరలోని బ్రాహ్మణపల్లిలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి 6.92 (ఇంటి స్థలానికి, నిర్మాణానికి) లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేశారు. అయితే బాధితులు రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పరిహారం ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ పంపిన నివేదికకు ఆర్థిక శాఖ తాజాగా ఆమోదముద్ర వేసింది. పునరావాస ప్యాకేజీకి మొత్తం రూ.78.12 కోట్ల ఖర్చు కానుంది.

  • Loading...

More Telugu News