: హరీష్ రావు కాన్వాయ్ ను అడ్డుకున్నారు


తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నేడు హరీష్ పర్యటిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో నిర్మించాలనుకుంటున్న పెన్ గంగ బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అంతేకాకుండా జిల్లాలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను అధికారులతో కలసి ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలో వెళుతున్న ఆయన కాన్వాయ్ ను చించోలి(బి) వద్ద ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News