: షాంగైలో కేసీఆర్...చైనా పారిశ్రామికవేత్తలకు విందు ఇవ్వనున్న టీ సీఎం
చైనా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూసుకెళుతున్నారు. నిన్నటిదాకా రెండు రోజుల పాటు చైనా నగరం డేలియన్ లో ఉన్న కేసీఆర్ నేటి ఉదయం షాంగై చేరుకున్నారు. షాంగైలోని న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బృందం సందర్శించనుంది. నేటి సాయంత్రం కేసీఆర్ అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. విందు సమావేశంలో భాగంగానే పలువురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడనున్న ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.