: స్మితా సబర్వాల్ కేసులో ఔట్ లుక్ ప్రతినిధులకు ఊరట... అరెస్టు నిలుపుదల
ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ కేసులో ఔట్ లుక్ ప్రతినిధులకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పిటిషనర్ల అరెస్టుతో పాటు తదుపరి చర్యలన్నింటిపైన స్టే విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సబర్వాల్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఔట్ లుక్ ప్రతినిధులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు జరిగిన వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు.