: ద్వారకా తిరుమలలో చంద్రబాబు...‘తోటపల్లి’ని జాతికి అంకితం చేయనున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ‘చంద్రన్న యాత్ర’ పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చేరుకుంది. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా ఏర్పాటు కానున్న ఓ ఆసుపత్రికి ఆయన భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆయన చేరుకుంటారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రప్రథమంగా ప్రారంభించిన తోటపల్లి ప్రాజెక్టు 12 ఏళ్లకు పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టును చంద్రబాబు నేడు జాతికి అంకితం చేయనున్నారు.