: ఇన్వెస్టర్ల ఆనందం రెండు రోజుల ముచ్చటే!


రెండు రోజుల లాభాల అనంతరం, భారత స్టాక్ మార్కెట్లు తిరిగి ఈరోజు నష్టాల్లోకి జారిపోయాయి. అంతర్జాతీయ స్థాయి పరిణామాలు, చైనాలో నెలకొన్న ఆందోళన, డాలర్ బలపడటం తదితర కారణాలతో అమ్మకాల వైపే పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 11:10 గంటల సమయంలో సెన్సెక్స్ 309 పాయింట్ల నష్టంతో 25,409 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 1.20 శాతం తక్కువ. ఇదే సమయంలో నిఫ్టీ సూచి 100 పాయింట్లకు పైగా నష్టంలో సాగుతోంది. మిడ్, స్మాల్ క్యాప్ లు సైతం ఒక శాతం దిగజారాయి. బీపీసీఎల్, టీసీఎస్, టాటా పవర్ మినహా మిగతా అన్ని ప్రధాన కంపెనీలూ నష్టాల్లో సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News