: రామ్ చరణ్ మహా కోపిష్ఠి... తనయుడి గురించి చిరంజీవి
తన భార్య సురేఖ తర్వాత కుమారుడు రామ్ చరణే తనకు చాలా ఇష్టమని మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి అన్నారు. అయితే రామ్ చరణ్ కు కోపం ఎక్కువని చెప్పారు. ఈ కోపం తనకు తాత నుంచి వారసత్వంగా వచ్చిందని చరణ్ చెబుతాడని అన్నారు. అయితే, కుటుంబం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తాడని, ఎంతో పరిణతిని ప్రదర్శిస్తాడని తెలిపారు. వాస్తవానికి తన పుట్టిన రోజును తన భార్యతో కలసి ఎక్కడో జరుపుకుంటుంటానని... ఈసారి రామ్ చరణ్ కోరిక మేరకే హైదరాబాదులో జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. సినిమా షూటింగ్ లకు రామ్ చరణ్ లేటుగా వెళ్తుంటాడని, అలా చేయవద్దని తాను చెప్పానని అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాలను పంచుకున్నారు.