: 'సూదిగాడు' ఏం గుచ్చాడో... రెండు వారాలకు ముక్కు, నోటి నుంచి రక్తం!


సుమారు 15 రోజుల క్రితం సైకో సూదిగాడి బారిన పడ్డ ఓ బాధితురాలి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో గంటా చంటి అనే మహిళ రోడ్డుపై నడిచి వెళుతుండగా, మోటార్ సైకిల్ పై వేగంగా వచ్చిన ఓ వ్యక్తి వెనుక నుంచి సూది పొడిచి పరారయ్యాడు. ఈమెను పరీక్షించిన వైద్యులు భయపడొద్దని చెప్పి పంపారు. అప్పటికి బాగానే ఉన్నా, ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. నిన్న ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఇప్పుడు చంటితో పాటు సూదిగాడి బారిన పడ్డ మిగతా బాధితుల్లో భయాందోళన మొదలైంది. అసలు ఆ సైకో ఏం గుచ్చాడన్న విషయంమై ప్రజల మధ్య చర్చలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News