: నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం... ఖమ్మం జిల్లా బోనకల్లు వద్ద ఘటన
నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైల్లో రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా బోనకల్లు వద్ద చైన్ లాగి రైలును ఆపేసిన దొంగలు ప్రయాణికులను దోచుకున్నారు. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం దోపిడీ దొంగలు తమ పనిని అత్యంత సులువుగా పూర్తి చేసుకుని ఉడాయించారు. రైలు బోనకల్లు పరిసరాలకు చేరగానే రైలును నిలిపేసిన దొంగలు రైల్లోని మహిళలపై దాడి చేసి బంగారం, నగదును అపహరించారు. ప్రతిఘటించిన కొందరు ప్రయాణికులపై దొంగలు దాడికి దిగినట్లు సమాచారం. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు ఆ తర్వాత అక్కడే రైలు దిగిపారిపోయారు. దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.