: యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన సానియా... హింగిస్ తో కలిసి జైత్రయాత్ర


యూఎస్ ఓపెన్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకుపోతోంది. మొన్నటికి మొన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న సానియా వెనువెంటనే అమెరికా వెళ్లిపోయింది. టెన్నిస్ లో నిన్నటి సంచలనం మార్టినా హింగిస్ తో జతకట్టిన సానియా వరుస విజయాలతో సాగిపోతోంది. కొద్దిసేపటి క్రితం యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో సానియా-హింగిస్ జంట సునాయాసంగా విజయం సాధించింది. ఇటలీకి చెందిన ఎర్రానీ, పెన్నెట్టా జోడీపై 6-4, 6-1 స్కోరు తేడాతో వరుస సెట్లలోనే సానియా జోడీ అలవోకగా నెగ్గింది. తద్వారా సానియా జోడీ యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది.

  • Loading...

More Telugu News