: కోర్టుకెక్కిన ఎమ్మెల్యే కూతురు ప్రేమ వివాహం
కన్నతండ్రి తనకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కుమార్తె రమ్య గుంటూరు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఈ రోజు ఆశ్రయించింది. సందీప్ అనే వ్యక్తిని తాను ప్రేమ వివాహం చేసుకోగా.. దానిని కప్పిపుచ్చి తనకు మరో పెళ్లి చేసేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకోసం సందీప్ ను తన తండ్రి పోలీసులతో కిడ్నాప్ చేయించారని ఆరోపించింది. నాలుగేళ్లుగా భర్తను కలవకుండా తనను ఇంట్లో నిర్బంధించారని ఆమె పేర్కొంది. ఎలాగైనా తన భర్తను విడిపించాలని ఆమె కోరింది.