: ప్రధాని మోదీ, వెంకయ్య, బాబులపై ఫిర్యాదు చేసిన రఘువీరా

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను వారు ముగ్గురూ మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును బయటకు పడేయడమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ అని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ 'ఇసుక అక్రమ రవాణా' అని ఆయన ఎద్దేవా చేశారు.