: నిధుల సేకరణకు జర్మనీలో పర్యటించనున్న బాలయ్య
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జర్మనీలో పర్యటించనున్నారు. ఈ నెల 13న జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో తెలుగు కమ్యూనిటీ వారు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలయ్య హాజరుకానున్నారని తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈటీవీలో ప్రసారమైన డీ4 డాన్స్ గ్రూప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వారు వెల్లడించారు. గతంలో అమెరికాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా, జర్మనీలో ఇదే తొలిసారని వారు వివరించారు.