: సిబ్బంది ఆందోళనతో నిలిచిపోయిన 1000 విమాన సర్వీసులు


లుఫ్తాన్సా విమాన సిబ్బంది ఆందోళనతో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో సుమారు 1000 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పైలట్ల పదవీ విరమణ వయస్సు, పింఛన్లు, మొదలైన డిమాండ్లతో సిబ్బంది రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో సుమారు 1.4 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. కాగా, సమ్మెపై విమానయాన శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పలుదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే కాలం వెళ్లదీశారు.

  • Loading...

More Telugu News