: భారత్-ఏ టెస్టు జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్
బంగ్లా-ఏ జట్టుతో ఆడనున్న మూడు రోజుల టెస్టు మ్యాచ్ లో భారత-ఏ జట్టుకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఈ టెస్టు జట్టులో రవీంద్ర జడేజా, వరుణ్ ఆరోన్ మినహాయించి రంజీ ఆటగాళ్లే ఎక్కువగా చోటు సంపాదించుకోవడం విశేషం. టెస్టు, వన్డే జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు, ఆల్ రౌండర్ కరణ్ నాయర్ కావడం విశేషం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ నెల 22 నుంచి 29 వరకు ఈ టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టు జట్టు: కెప్టెన్ శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్, కరణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, నమన్ ఓజా, జయంత్ మాధవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, శ్రేయస్ గోపాల్, అభిమణ్యు మిధున్, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే, జాక్సన్.