: శ్రీవారి బర్త్ డే ను ఫుల్ ఎంజాయ్ చేసిన శిల్పాశెట్టి


ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ రాజ్ పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరిపింది. ఈ సంబరాల్లో భాగంగా తన భర్తతో కలసి, తన జీవితంలో తొలిసారి పారా సెయిలింగ్ చేసింది. ఆ సందర్భంగా తీయించుకున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది శిల్ప. బర్త్ డే బాయ్ తో కలసి తొలిసారిగా చేసిన పారా సెయిలింగ్ గొప్ప అనుభూతిని మిగిల్చిందని శిల్పాశెట్టి ట్వీట్ చేసింది. మరోవైపు రాజ్ కుంద్రా కూడా తన బర్త్ డే గురించి ట్వీట్ చేస్తూ... తన జీవితంలోనే ఇది గొప్ప బర్గ్ డే సెలబ్రేషన్ అని చెప్పాడు. అంతే కాకుండా, తన భార్య శిల్పాశెట్టికి థ్యాంక్స్ చెప్పాడు.

  • Loading...

More Telugu News