: ఇద్దరు టీడీపీ నేతల మధ్య ప్రొటోకాల్ వివాదం
చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆ పార్టీ నాయకురాలు పోతుల సునీత మధ్య ఇవాళ ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈరోజు వికలాంగ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం జరుగుతుండగానే ఎంపీ మల్యాద్రి సమక్షంలో టీడీపీ నేతల నడుమ గొడవ తలెత్తింది. దాంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ జరిగింది. అంతటితో ఊరుకోకుండా నినాదాలు చేస్తూ కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దాంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసగా మారింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు.