: చైనాలో మోదీని ప్రశంసించిన కేసీఆర్
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ నిందించే ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. చైనా పర్యటన సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, సంస్కరణల విషయంలో ప్రధాని మోదీ గట్టిగా పనిచేస్తున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని ఆయన తెలిపారు. భారత్ లో ప్రజాస్వామ్యం బలంగా పనిచేస్తోందని అన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం అందుబాటులో తీసుకొచ్చామని ఆయన వివరించారు.