: తమిళనాడులో లక్ష కోట్ల పెట్టుబడులు: జయలలిత
తమిళనాడులో వివిధ సంస్థలు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆమె మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు తమిళనాడులో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. మౌలిక సదుపాయల కల్పన రంగంలో 250 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆహ్వానించనున్నామని ఆమె చెప్పారు. వివిధ దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి యువతకు ఉపాధి కల్పిస్తామని ఆమె వెల్లడించారు. జపాన్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దీంతో వ్యాపార వేత్తలు, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఆమె అభినందించారు.