: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... కేసీఆర్ మాత్రం చైనాలో పర్యటిస్తున్నారు: టీకాంగ్రెస్ ఫైర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయాలు జరిగాయనే తాము స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని... అయినా, ఇప్పుడు ప్రతి విషయానికి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీకాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అజ్ఞానంతో టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇదేమీ పట్టనట్టు చైనాలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు.