: పాక్ సీనియర్ జర్నలిస్ట్ అఫ్తాబ్ ఆలమ్ కాల్చివేత


పాకిస్థాన్ లో సీనియర్ జర్నలిస్టుగా పేరున్న అఫ్తాబ్ ఆలమ్ ను నేడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీ ఉత్తర ప్రాంతంలోని ఆయన నివాసం సమీపంలోనే ఈ ఘటన జరిగిందని 'డాన్' ఆన్ లైన్ ఎడిషన్ వెల్లడించింది. సర్ సయ్యద్ మార్కెట్ సమీపంలో ఆయన ఉండగా, దూసుకొచ్చిన దుండగులు సూటిగా ఆయన తలలోకి కాల్పులు జరిపినట్టు డీఐజీ ఫిరోజ్ షా వెల్లడించారు. ఘటనా స్థలి నుంచి మూడు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనను కరాచీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం, భద్రతా దళాల పనితీరును అఫ్తాబ్ మరణం ప్రశ్నిస్తోందని, తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాగా, అఫ్తాబ్ 'జియో న్యూస్' పత్రిక ఉద్యోగి.

  • Loading...

More Telugu News