: గద్దర్ పోటీ చేసే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత: తమ్మినేని
ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేసే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్గొండ జిల్లాలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ ఉపఎన్నికల్లో వామపక్ష పార్టీ ఉమ్మడి అభ్యర్ధిగా గద్దర్ ను బరిలో దింపాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయని అన్నారు. అయితే ఆయన పోటీకి సంసిద్ధత వ్యక్తం చేయలేదని, మరి కొంత సమయం కోరారని, దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిన్నటి వరకు స్వచ్ఛ తెలంగాణ అన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దత్తత తెలంగాణ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ దంతా ప్రచార ఆర్భాటమేనని ఆయన తెలిపారు.