: దూసుకెళ్లిన బుల్స్... రెండు రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు వెనక్కి!


గడచిన పది సెషన్ల వ్యవధిలో భారత ఇన్వెస్టర్లు కోల్పోయిన మొత్తంలో 40 శాతం తిరిగొచ్చింది. కేవలం రెండు సెషన్ల వ్యవధిలో భారత స్టాక్ మార్కెట్ 3 శాతానికి పైగా పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 94,91,922 కోట్లకు చేరింది. మంగళవారం నాటి సెషన్ మాదిరిగానే, నేడు సైతం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొత్త కొనుగోళ్లు జరిపారు. సెషన్ ఆరంభంలోనే 400 పాయింట్ల లాభాన్ని కళ్లజూసిన సెన్సెక్స్, ఆపై ఏ దశలోనూ నష్టాలవైపు నడవలేదు. మొత్తం 2,791 కంపెనీలు ట్రేడింగ్ జరుపుకోగా, 1,969 కంపెనీలు లాభపడ్డాయ నేటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 401.71 పాయింట్లు పెరిగి 1.59 శాతం లాభంతో 25,719.58 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 130.55 పాయింట్లు పెరిగి 1.70 శాతం లాభంతో 7,818.60 పాయింట్లకు చేరింది. ఎన్ఎస్ఈ-50లో 42 కంపెనీల ఈక్విటీలు లాభాలను నమోదు చేసుకున్నాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.94 శాతం, స్మాల్ కాప్ 1.84 శాతం పెరిగాయి. ఈ సెషన్లో ఎన్ఎండీసీ, హిందాల్కో, వీఈడీఎల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభపడగా, బోష్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, విప్రో తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News