: వైఎస్ జగన్ ను కలిసిన తెలుగు యువశక్తి అధ్యక్షుడు
తమిళనాడులోని పాఠశాలల్లో తెలుగు భాష తొలగించడంపై రేపు ఇందిరా పార్క్ వద్ద తాము చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి మద్దతివ్వాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వైకాపా అధినేత జగన్ ను కోరారు. ఈ మేరకు జగన్ తో సమావేశమైన జగదీశ్వర రెడ్డి, తమ నిరసనలో పాల్గొని, పోరాటానికి చేయూతనివ్వాలని అడిగారు. తమిళనాడులో తెలుగువారి సమస్యలపై పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. ఏ మాత్రం వీలున్నా ఇందిరాపార్కు వద్దకు వస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.