: ఎమ్మెల్యేల అనర్హతపై వాదనలు పూర్తి... తీర్పు రిజర్వులో ఉంచిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ముగ్గురు టీడీపీ, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. దానిపై పలుమార్లు విచారణ జరగగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసుదనాచారికి కోర్టు నోటీసు కూడా ఇచ్చింది. అయితే ఆయన నోటీసులు తీసుకోలేదు.