: మాది అత్యుత్తమ పారిశ్రామిక విధానం: చైనాలో కేసీఆర్
ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్నామని, ఇప్పటికే అత్యుత్తమంగా ఉండేలా పారిశ్రామిక విధానాన్ని తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ప్రపంచ ఆర్థిక వేదికలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో దాదాపు పదిహేనేళ్ల పాటు పోరాడాల్సి వచ్చిందని, అంతమాత్రాన తాము వేర్పాటువాదులం కాదని స్పష్టం చేశారు. భారత ప్రధాని సంస్కరణ మార్గంలో పయనిస్తున్నారని కొనియాడిన కేసీఆర్, నీతి ఆయోగ్ టీంనూ పొడగ్తలతో ముంచెత్తారు. తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక పాలసీ గురించి వెల్లడించిన ఆయన, రెండు వారాల్లో పరిశ్రమలకు అనుమతి పొందే హక్కు లభించేలా చట్టాలు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులతో తరలిరావాలని కేసీఆర్ కోరారు.