: తెదేపా ఏమన్నా మద్యం బాటిలా? రాత్రి తాగితే తెల్లారేసరికి ఖాళీ అవడానికి!: రేవంత్ రెడ్డి


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామని కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రాత్రి తాగితే తెల్లారేసరికి ఖాళీ కావడానికి తమ పార్టీ ఏం మద్యం సీసా కాదని అన్నారు. తనకు స్వాగతం పలికేందుకు రహదారుల వెంట నిలబడి వున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, "సింహం సింగిల్ గా హైదరాబాద్ వస్తోందని తెలుసుకున్న కేసీఆర్, ప్రత్యేక విమానం వేసుకుని చైనాకు పారిపోయాడు. మా అడ్డా ఇక్కడనే, ఇక్కడే ఉంటాం. కేసీఆర్ దొర కాదు... అరాచకవాది" అని దుయ్యబట్టారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని బలిదానాలు చేసిన విద్యార్థులను మరచిపోయిన కేసీఆర్, ఫాం హౌస్ లో పెరుగన్నం తిని పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు తెచ్చేందుకు చైనాకు వెళ్లిన ఆయన ఆర్థిక మంత్రిని ఎందుకు వెంట తీసుకెళ్లలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News