: ఇన్ స్టాగ్రాంలో కూడా ఇక నుంచి ప్రకటనలు


ఇప్పటివరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా ఉన్న ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రాంలో ఇకపై ప్రకటనలు కనిపించబోతున్నాయి. ఈ మేరకు ప్రకటనలను ఆహ్వానించాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు కేవలం ఎనిమిది దేశాల్లో మాత్రమే ఇన్ స్టాగ్రాంలో ప్రకటనలు ఉండేవి. ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, భారత్ సహా మరో 20 దేశాల్లో యాడ్స్ ను ఆహ్వానిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నెల 30 నాటికి దాదాపు అన్ని దేశాల్లో ఇన్ స్టాగ్రాంలో ప్రకటనలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News