: ఎల్బీ నగర్ లో రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్... టీడీపీలో చేరిన టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు


ఓటుకు నోటు కేసు నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు నిన్నటిదాకా తన సొంతూరు కొడంగల్ కే పరిమితమైన టీ టీడీఎల్పీ ఉపనేత, ఆ పార్టీ యువ సంచలనం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదుకు వచ్చారు. సొంత నియోజకవర్గానికి పరిమితం కావాలన్న నిషేధాన్ని కోర్టు నిన్న ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాలు వెలువడిన మరునాడే రేవంత్ రెడ్డి నేటి ఉదయం కొడంగల్ నుంచి హైదరాబాదు బయలుదేరారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్న రేవంత్ రెడ్డికి అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు రేవంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

  • Loading...

More Telugu News